After Bengaluru, Hyderabad witnesses rare ‘22 degree halo’ around Sun
#Hyderabad
#SunHalo
#Bengaluru
#22DegreeHalo
కొద్దిరోజుల కిందటే బెంగళూరులో మనోహరంగా కనిపించిన సన్ హాలో.. ఇప్పుడిక హైదరాబాద్‌లో ప్రత్యక్షమైంది. సూర్యుడి చుట్టూ సప్తవర్ణాల వలయం ఆవరించి కొన్ని గంటలపాటు కనువిందు చేసింది. ఏపీలోని కొన్ని నగరాల్లోనూ ఈ అపురూప దృశ్యం కనిపించింది. ఇలా కొత్తగా కనిపించిన సూర్యుడిని ఫొటోలు, వీడియోలు తీయడానికి జనం ఎగబడ్డారు. ఆకాశం మేఘావృతం కావడం వల్ల మరి కొన్ని ప్రాంతాల ప్రజలు ఈ అద్భుతాన్ని చూడలేకపోయారు.